అమరావతి: పొత్తుల అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. కుప్పం పర్యటనలో చంద్రబాబు జనసేనతో పొత్తులకు సంబంధించి కార్యకర్తలు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ వన్ సైడ్ లవ్ ఉంటే సరిపోదని అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ మాట్లాడుతూ పొత్తుల విషయంలో ఒక్కడినే నిర్ణయం తీసుకోనన్నారు. ప్రతి జనసైనికుడి ఆలోచనతో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే బీజేపీతో జనసేన పొత్తులో ఉందని, పలు పార్టీలు జనసేనతో పొత్తు కోరుకోవచ్చన్నారు. జనసేన క్షేత్రస్థాయిలో పుంజుకుంటోందని, పొత్తులపై ఒకే మాట మాట్లాడుదామని, పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెడదామని పార్టీ శ్రేణులకు పవన్ సూచించారు.
ఇవి కూడా చదవండి