Advertisement
Advertisement
Abn logo
Advertisement

డిసెంబరు నెలాఖరు నాటికి జనసేన కమిటీల ఏర్పాటు పూర్తి

ఇందుపల్లిలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ యాళ్ల నాగసతీష్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్న నాదెండ్ల మనోహర్‌

మనస్పర్థలు విడనాడి సమష్టిగా పనిచేయాలి 

పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌

అమలాపురం రూరల్‌, నవంబరు 29: జనసేన పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు డిసెంబరు నెలాఖరు నాటికి గ్రామ, మండల కమిటీల ఏర్పాటు పూర్తిచేయడం జరుగుతుందని జనసేన రాష్ట్ర పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు మనస్పర్థలు విడనాడి పార్టీ విజ యానికి సమష్టిగా పనిచేయాలని సూచించారు. ఇందు పల్లి ఏ1 కన్వెషన్‌ హాలులో సోమవారం అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి శెట్టిబత్తుల రాజబాబు అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశానికి మనోహర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జగన్‌ ప్రభుత్వం అధ్వాన రోడ్లను అభివృద్ధి చేయదు. అలాగని జన సైని కులు ప్రజల కష్టాలను చూడలేక రోడ్ల అభివృద్ధికి ముం దుకు వస్తుంటే పోలీసులతో   కేసులు పెట్టిస్తోందని ఆరోపించారు. అధికార పార్టీ అక్రమాలను ప్రశ్నించే జన సైనికులపై కేసులు పెరిగిపోతుండడంతో జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు జనసేన ప్రత్యేక న్యాయవిభాగాలను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 4800 క్రియా శీలక సభ్యత్వాలు చేసి రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచారని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. గ్రామ సీమల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు జగన్‌ ప్రభుత్వం వెనక్కు తీసుకోవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఒక్క ఈ జిల్లాలోనే రూ.230 కోట్ల నిధులు పంచాయతీల్లో లేకుం డా చేశారని విమర్శించారు. భావి తరాల భవిష్యత్తు కోసమే జనసేన పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. నేడు ఏ వర్గాన్ని కదిలించినా పవన్‌కల్యాణ్‌ నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. 


మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ సతీష్‌ చేరిక

అమలాపురం మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ యాళ్ల నాగ సతీష్‌ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ సమక్షంలో జన సేనలో చేరగా పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. హనుమాన్‌ బుజ్జి ఆధ్వర్యంలో సేకరించిన నగదు మొత్తాన్ని కొవిడ్‌తో బాధపడిన కుటుంబాలకు మనోహర్‌ అందజేశారు. ఈ సమావేశంలో జిల్లాశాఖ అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ మాట్లాడారు. సమావేశంలో నాయకులు డీఎంఆర్‌ శేఖర్‌, పితాని బాలకృష్ణ, వేగుళ్ల లీలాకృష్ణ, కవి కొండల సరోజ, ముత్తాబత్తుల శశిధర్‌, లింగోలు పండు, పిండి సాయిబాబా, బట్టు పండు, మోకా బాలయోగి, కొప్పుల నాగమానస, అయితాబత్తుల ఉమామహేశ్వర రావు, పనసా బుజ్జి, రొక్కాల విజయలక్ష్మి పాల్గొన్నారు.  కాగా కార్యకర్తల సమావేశంలో అధినాయకులు వర్గ విభే దాలు విడనాడి సమష్టిగా పనిచేయాలని సూచించిన అరగంట వ్యవధిలోనే సమావేశం ముగిసిన వెంటనే పార్టీలోని వారు రెండు వర్గాలుగా విడిపోయి వివాదానికి దిగారు. దీంతో పార్టీ నేతలు వారిని సముదాయించారు. 


తడిసిన ధాన్యాన్ని కొనాలి : నాదెండ్ల

రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సమస్యలను పట్టించుకోకుండా మొద్దు నిద్రపోతోందని జనసేన నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం తక్షణం ఆదుకో వాలని ఆయన డిమాండు చేశారు. సమనసలో ఇటీవల భారీ వర్షాలకు ముంపు బారిన పడ్డ పంట పొలాలను సోమవారం ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని  డిమాండు చేశారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని పంట నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలన్నారు. 

Advertisement
Advertisement