Abn logo
Sep 28 2021 @ 03:06AM

రోడ్లపై అక్టోబరు 2న జనసేన శ్రమదానం

పాడైన రోడ్లకు మరమ్మతులు.. రెండుచోట్ల పాల్గొననున్న పవన్‌


అమరావతి, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యం, భారీ వర్షాలు కలగలిసి దెబ్బతీసిన రాష్ట్రంలోని రహదారులపై జనసేన పార్టీ కార్యకర్తలు శ్రమదానం నిర్వహించి.. వాటికి మరమ్మతులు చేయనున్నారు. గాంధీ జయంతి రోజైన అక్టోబరు రెండోతేదీన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. అధినేత పవన్‌ కల్యాణ్‌ రెండు ప్రాంతాల్లో స్వయంగా శ్రమదానంలో పాల్గొంటారని ఆ పార్టీ కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘అక్టోబరు 2న ఉదయం 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీపై దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు చేసే కార్యక్రమంలో పవన్‌ పాల్గొంటారు. మధ్యాహ్నం 2గంటలకు అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి-ధర్మవరం రోడ్డుకు శ్రమదానంలో భాగంగా మరమ్మతులు చేపడతారు’’ అని ఆ ప్రకటనలో తెలిపారు.