Abn logo
Aug 12 2021 @ 13:24PM

ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు: నాందెడ్ల మనోహర్

రాజమండ్రి: వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. జనసేన పార్టీ నియోజకవర్గ సభ్యత్వాల నమోదులో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ ప్రభుత్వంపై ఎక్కడ చూసినా విమర్శలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ప్రజల్లో ఆందోళన పెరుగుతోందన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని తెలిపారు. యువత ఉపాధి కోల్పోయి వలసలు వెళ్తున్నారని.. భవిష్యత్‌పై వారికి భయం పట్టుకుందన్నారు. ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయాల వద్ద జనసేత నేతల వినతిపత్రం కూడా తీసుకోకుండా పోలీసులుతో అడ్డుకున్నారన్నారు. ఏపీ ఆర్థిక లోటులో చిక్కుకుందని.. జనసేన పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి మనోహర్ ఇన్సూరెన్స్ పత్రాలు, మెడికల్ కిట్లు అందజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.