రాష్ట్రాన్ని అత్యాచారాంధ్రప్రదేశ్‌గా మార్చారు

ABN , First Publish Date - 2022-05-15T05:50:13+05:30 IST

ముఖ్యమంత్రి అసమర్ధతతో రాష్ట్రం అత్యాచారాంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోన బోయిన శ్రీనివాసయాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రాన్ని అత్యాచారాంధ్రప్రదేశ్‌గా మార్చారు
కలెక్టరేట్‌ ఎదుట జరిగిన మహా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు

బోనబోయిన శ్రీనివాసయాదవ్‌

జనసేన ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట మహా నిరసన


గుంటూరు(తూర్పు), మే14: ముఖ్యమంత్రి అసమర్ధతతో రాష్ట్రం అత్యాచారాంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోన బోయిన శ్రీనివాసయాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస అత్యాచారాలకు నిరసనగా శనివారం జిల్లా కలెక్టర్‌ కార్యలయం ఎదుట జనసేన ఆధ్వర్యంలో మహా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యత లేని ముఖ్యమంత్రి- బాధ్యత తెలియని హోంమంత్రి ఉండటం వల్లే రాష్ట్రానికి ఈ గతి పట్టిందని విమర్శించారు. గడిచిన యాభై రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆడపిల్లలపై ఆరవైకు పైగా అత్యాచారాలు జరిగితే మరో ముఖ్యమంత్రి అయితే ఈ పాటికి రాజీనామా చేసేవాడని ఆగ్ర హం వ్యక్తం చేశారు. తనకు తాను సింహాలతో పోల్చుకునే ముఖ్యమంత్రి, ఆడపిల్లలను మాత్రం కాపాడలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు. జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఆడవారు బయటకు రావద్దని హెచ్చరించారు. అత్యాచారాల్లో రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా ఉంచిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందని ఎద్దేవా చేశారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టారని మండిపడ్డారు. నగర అధ్యక్షుడు నేరెళ్ల సురేష్‌ మాట్లాడుతూ తాడేపల్లి ప్యాలెస్‌ పక్కన అత్యాచారం జరిగితే నింఽధితుల్ని ఇంత వరకు పట్టుకోలేని ముఖ్యమంత్రి నుంచి ఆడవారి భద్రత గురించి ఆశించడం వృధానే అవుతుందన్నారు. దిశ చట్టం పోస్టర్లకే పరిమితం అయ్యిందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు నాయబ్‌ కమల్‌, బిట్రగుంట మల్లిక, పాకనాటి రమాదేవి, అనసూయాదేవి, నాగలక్ష్మీ, మల్లీశ్వరి, ఆసియా, తిరుపతమ్మ, విజయలక్ష్మీ, శ్రీదేవి, ఉదయలక్ష్మీ, కవిత, మాధవి, ఆళ్లహరి, మాణిక్యలరావు, కిరణ్‌, మల్లి, ప్రసాదు, కిషోర్‌, రత్తయ్య, సుబ్బీరావు, రాజు. త్రిపుర., కోటి, కార్పొరేటర్‌ యర్రంశెట్టి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-15T05:50:13+05:30 IST