తూర్పు గోదావరి( రాజమండ్రి): రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజలతో కలిసి జనసేన ఉద్యమిస్తుందని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసినవారు ఇంట్లో ఫ్యాన్ వేసుకోవడానికి కరెంట్ లేకుండా పోయిందన్నారు. స్లాబ్ల పద్ధతి ఎందుకు మార్చాల్సి వచ్చిందో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తాము ముందు నుంచి చెబుతున్నట్లు నవరత్నాల్లో ప్రతిదీ మోసమేనని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులపై సీఎం జగన్కు కనీసం బాధ లేదన్నారు. గ్రామాల్లో విద్యుత్ కోతలు ఎనిమిది గంటలకు చేరుకున్నాయని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి