Abn logo
Sep 27 2021 @ 12:17PM

AP: రాష్ట్రంలో ఇంతమంది సన్నాలున్నారా!.. మాకు ఇప్పుడే తెలిసింది: జనసేన నేతలు

అమరావతి: పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై జనసేన నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ సినిమాను రాజకీయం చేసిందెవరు?.. రాజకీయాల్లోకి లాగిందెవరని ప్రశ్నించారు. సినిమాను రాజకీయాల్లోకి ప్రభుత్వమే లాగి.. దానిపై మాట్లాడితే.. మళ్లీ రాజకీయం ఎందుకని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యలో ఉన్నామా అనేది మర్చిపోయారని, రెండున్నరేళ్లు అయినా.. ఇంకా ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు. పవన్ కల్యాణ్‌ను మంత్రి వెల్లంపల్లి  సన్నాసి అంటూ మాట్లాడారని, కానీ రాష్ట్రంలో ఇంతమంది సన్నాసులున్నారని మాకు ఇప్పుడే తెలుస్తోందని జనసేన నేతలు అన్నారు.


ఏదైనా ఒక అంశంపై మాట్లాడితే దానికి సంబంధించిన మంత్రి మాట్లాడాలని జనసేన నేతలు అన్నారు. అంతేగానీ ఎవరు పడితే వారు మాట్లాడకూడదన్నారు. వెల్లంపల్లికి రాజకీయ భిక్ష పెట్టిందే పవన్ కుటుంబం అన్న విషయం మర్చిపోయారన్నారు. తమ అధినేత పవన్ ఏ మంత్రిని కూడా వ్యక్తిగతంగా దూషించలేదని, విమర్శలు చేయలేదన్నారు. దుర్గమ్మ గుడి రథంపై ఉన్న సింహం బొమ్మను కొట్టేసిన సన్నాసి మంత్రి వెల్లంపల్లి అని అన్నారు. ఇప్పటి వరకు సంయమనం పాటించామని, ఇకనైనా మారకపోతే దుర్గమ్మ గుడి చుట్టూ తిప్పికొట్టే రోజు వస్తుందని జనసేన నేతలు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండిImage Caption