Abn logo
Sep 26 2021 @ 23:46PM

మంత్రి వెలంపల్లి మళ్లీ నోరు జారితే ముట్టడే

సమావేశంలో పాల్గొన్న నేతలు

జనసేన పార్టీ జిల్లా నాయకుల హెచ్చరిక



తాడేపల్లిగూడెం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): జనసేన అధి నేత పవన్‌ కల్యాణ్‌పై దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ మళ్లీ నోరు జారితే ముట్టడి తప్పదని జనసేన పార్టీ  జిల్లా నాయకులు హెచ్చరించారు. తాడే పల్లిగూడెంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవింద రావు(చినబాబు) అధ్యక్షతన ఆది వారం జిల్లా  కార్యవర్గ సమావేశాన్ని  నిర్వహించారు. పవన్‌ కళ్యాణ్‌ను కించపరు స్తూ వెలంపల్లి మాట్లాడడంపై నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు ఖండించారు. మరోసారి ఇటు వంటి వ్యాఖ్యలు చేస్తే విజయవాడలో ధర్నా నిర్వహిస్తామని జిల్లా నాయ కులు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారాలపై కాకుండా పరిపాలనపై దృష్టి పెట్టాలని జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి చినబాబు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బొలి శెట్టి శ్రీనివాస్‌ హితవు పలికారు. మంత్రి వెలంపల్లికి సమాధానంగా జనసేన కార్యకర్తలు స్పం దించి ఆలోచింపచేసే పోస్టులు పెట్టాలని సూచించారు. ప్రతి నెలా ఆడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కార్యవర్గ సభ్యులంతా ప్రజా సమస్యలపై చర్చించుకుని పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేద్దామన్నారు. అక్టోబరు 2న జనసేన తలపెట్టిన రహదారుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు చేగొండి సూర్యప్రకాశరావు, బొమ్మిడి నాయకర్‌, రెడ్డి అప్పలనాయుడు, రాష్ట్ర కార్యదర్శి కారేపల్లి శాంతిప్రియ తదితరులు మాట్లాడారు. విడివాడ రామచంద్రావు, గుణ్ణం నాగబాబు, బాలరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు రామిశెట్టి సురేష్‌, పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, జిల్లా కార్యవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు.