AP: టాస్క్‌ఫోర్స్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న పోతిన మహేష్
ABN , First Publish Date - 2022-02-01T17:13:32+05:30 IST
జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ మంగళవారం ఉదయం టాస్క్‌ఫోర్స్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.
విజయవాడ: జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ మంగళవారం ఉదయం టాస్క్‌ఫోర్స్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అస్లాం కేసులో మంత్రి వెల్లంపల్లిపై మహేష్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. నిందితులను వెల్లంపల్లి కాపాడుతున్నారంటూ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపైనే మహేష్‌ను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. మరోవైపు జనసైనికులు టాస్క్ ఫోర్స్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. తమ నేతను ఎందుకు విచారణకు పిలిచారో చెప్పాలంటూ నినాదాలు చేస్తున్నారు.