విజయవాడ: పొత్తులపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వైసీపీ శిబిరంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... మోసపూరిత వాగ్ధానాలతో వైసీపీ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దెబ్బకి తాడేపల్లి రాజప్రసాదంలో వణుకు మెదలైందని అన్నారు. జనసేన పొత్తుల వలన రాష్ట్ర రాజకీయాలలో పెనుమార్పు సంభవించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులే చెపుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజల ముందు మూడు సంవత్సరాల పాలనపై శ్వేత పత్రం విడుదల చేయగలరా అని సవాల్ విసిరారు. అసాంఘిక శక్తులను పోత్సాహించే అధికార పార్టీ నాయకులను రాబోయే ఎన్నికలలో తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ప్రస్తుత మంత్రులు నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లుంచుకోక తప్పదని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కూడా ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం ఆలోచించే వ్యక్తే అని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిపై బీజేపీ నేతలు చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. పోత్తులపై జనసేన అధినేత నిర్ణయమే తుది నిర్ణయమని పోతిన వెంకట మహేష్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి