Abn logo
Sep 27 2021 @ 13:44PM

పవన్ కళ్యాణ్‌ను విమర్శించే స్థాయి పేర్ని నానిది కాదు: నానాజీ

కాకినాడ: రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యం నడుస్తోందని జనసేన పార్టీ  పీఏసీ నేత పంతం నానాజీ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి పేర్ని నానిది కాదన్నారు. సినిమా రంగంలో కష్టలు చెప్పితే తప్పా అని ప్రశ్నించారు. ఇసుకలో.. బ్రాందీలో ధరలు పెంచి డబ్బులు దోచుకుంటున్న పార్టీ  వైసీపీ అని విమర్శించారు. తమకు తమ పార్టీకి ముగింపు చెప్పే సమయం దగ్గర పడిందని హెచ్చరించారు. పెద్ద ఆలయలు సుబ్బారెడ్డి హస్తంలో..చిన్న ఆలయలు వెల్లపల్లి  నాశనం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ మంత్రులు బాష, పద్ధతి మార్చుకోవాలని...లేకపోతే తమకు బుద్ది చెప్పే సమయం వస్తుందన్నారు. వైసీపీ మంత్రులు ఆ శాఖలో సొంత నిర్ణయాలతో పని చేసే సత్తా దైర్యం లేదని నానాజీ వ్యాఖ్యానించారు. 

ఇవి కూడా చదవండిImage Caption