అండగా నిలిస్తే అరెస్టులా?: నాదెండ్ల

ABN , First Publish Date - 2021-12-10T21:08:06+05:30 IST

టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులు, కార్మికులకు అండగా నిలిస్తే

అండగా నిలిస్తే అరెస్టులా?: నాదెండ్ల

అమరావతి: టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులు, కార్మికులకు అండగా నిలిస్తే అరెస్టులు చేస్తారా అని ప్రభుత్వంపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ పోరాడుతుంటే ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. కార్మికుల దీక్షలను భగ్నం చేసేలా పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. అర్థరాత్రి నుంచి కార్మికులను, మహిళలను అరెస్టులు చేస్తున్నారన్నారు. అండగా నిలిచిన జనసేన నాయకులను సైతం కట్టడి చేసేందుకు అదుపులోకి తీసుకొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ చర్యలు అప్రజాస్వామికమన్నారు.


తమ డిమాండ్ల కోసం ఆందోళనలు చేపట్టడం ప్రజాస్వామ్యంలో భాగమని ఆయన తెలిపారు. ఇందుకు భిన్నంగా వ్యవహరించడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. సొసైటీలుగా ఏర్పడి కాంట్రాక్ట్ ఉద్యోగులు, కార్మికులు విధులు నిర్వర్తిస్తుంటే ఇప్పుడు వారిని రోడ్డు మీదకు తెచ్చారని ఆయన పేర్కొన్నారు. శ్రామిక చట్టాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న టీటీడీ తక్షణమే తన నిర్ణయాలను పునరాలోచించుకోవాలన్నారు. కార్మికులకు, ఉద్యోగులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 



Updated Date - 2021-12-10T21:08:06+05:30 IST