Advertisement
Advertisement
Abn logo
Advertisement

జాబ్ క్యాలెండర్ మోసపూరితం

గుంటూరు: జగన్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ మోసపూరితమని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై నిత్యం దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. కరెంట్ కోతలతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. వైసీపీ నేతలు దళారులుగా మారి రైతులను దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. వేల కోట్లు అప్పులు చేసి ప్రభుత్వం ఏం ఉద్దరిస్తోందని ఆయన ప్రశ్నించారు. 


కృష్ణా నీటి విషయంలో రైతుల పక్షాన జగన్ ఉండాలన్నారు. జగన్, కేసిఆర్ వ్యక్తిగత లాభం కోసం ములాఖత్‌లు తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు న్యాయం చేయకపోతే జనసేన తరుపున పోరాటం చేస్తామని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. 

Advertisement
Advertisement