గుంటూరు: మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. రోశయ్యతో ఎంతో అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. ఆయన్నుంచి రాజకీయంగా చాలా నేర్చుకున్నామని తెలిపారు. రోశయ్య మృతి ఆంధ్ర రాష్ట్రానికి తీరని లోటని నాదెండ్ల మనోహర్ అన్నారు.