విజయవాడ: రాష్ట్రంలో జనసేన బలం రోజురోజుకీ పెరుగుతున్న తీరును తట్టుకోలేక జనసేన నేతలపై దాడులు చేస్తున్నారని వైసీపీ నాయకులపై ఆ పార్టీ నాయకుడు పోతిన మహేష్ ధ్వజమెత్తారు. పెడనలో జనసేన నాయకులపై జరిగిన దాడులను ఖండిస్తున్నామన్నారు. పరిషత్ ఎన్నికల ఫలితాలు వచ్చాక జనసేన నేతలపై వైసీపీ నాయకులు దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నిన్న రాత్రి పెడన నియోజకవర్గ ఇంచార్జ్ రామ్ సుధీర్ వాహనంపై దాడి చేశారన్నారు. పోలీసు స్టేషన్కి అతికూట వేటు దూరంలో దాడి జరిగిందన్నారు. వాహనం అద్దాలను పూర్తిగా పగుల కొట్టారన్నారు. ఈ దాడికి పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కారణమని ఆయన ఆరోపించారు. జనసేన బలం రోజురోజుకీ పెరుగుతున్న తీరును తట్టుకోలేక దాడులు చేస్తున్నారన్నారు.
పోలీస్ కంప్లైంట్ ఇస్తే అక్కడ సీసీ కెమెరాలు లేవని చెప్తున్నారన్నారు.శాంతి భద్రతల కాపాడడం కోసం పోలీసులు దృష్టి సారించాలన్నారు. 27,28 తేదీలలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇక్కడికి వస్తున్నారని ఆయన తెలిపారు. అన్ని విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్తామని ఆయన పేర్కోన్నారు. పెడనలో జరిగిన దాడి దోషులను 48 గెంటల్లో అరెస్ట్ చెయ్యాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు.