రూయా ఆస్పత్రి ప్రభుత్వానిదా? వైసీపీదా?: Janasena

ABN , First Publish Date - 2022-04-27T17:45:12+05:30 IST

తిరుపతి రుయా ఆస్పత్రి అంబులెన్స్ ఘటనపై జనసేన ఇంచార్జీ కిరణ్ రాయల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

రూయా ఆస్పత్రి ప్రభుత్వానిదా? వైసీపీదా?: Janasena

తిరుపతి: తిరుపతి రుయా ఆస్పత్రి అంబులెన్స్ ఘటనపై జనసేన ఇంచార్జీ కిరణ్ రాయల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.... రూయా ఆస్పత్రి ప్రభుత్వానిదా? వైసీపీదా? అని ప్రశ్నించారు. రూయా ఆస్పత్రిలో సైకిల్ పార్కింగ్ నుండి ప్రతి టెండర్ వైసీపీ నాయకులదే అని అన్నారు. అంబులెన్స్ ఘటన సమయంలో ప్రభుత్వ అంబులెన్స్‌లు ఏమయ్యాయో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంబులెన్స్ మాఫియాలో వైసీపీ కార్పొరేటర్లకు వాటాలు వెళ్తున్నాయని ఆరోపించారు. తిరుపతి నగరంలో వైసీపీ కార్పొరేటర్లు రూ.50ను కూడా వదలడం లేదని అన్నారు.


అంబులెన్స్ ఘటనలో బాధ్యులను చేసి ఆర్ఎంఓ సరస్వతి దళితురాలు కాబట్టి సస్పెండ్ చేశారని జనసేన నేత మండిపడ్డారు. రూయా ఆర్ఎంఓ అగ్రవర్ణాలకు చెందిన ఆమె కాదు.. కాబట్టే సస్పెండ్ చేశారని విమర్శించారు. రూయా ఆస్పత్రికి ఆధార్ కార్డుతో వెళితే.. డెత్ సర్టిఫికేట్ ఇచ్చి పంపే పరిస్థితి ఏర్పడిందన్నారు. రూయా ఆస్పత్రికి ఎవరైనా చికిత్స కోసం వస్తే కొందరు సిబ్బంది రోగులను బయట ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారని తెలిపారు. రిఫర్ చేసిన ఆస్పత్రుల నుండి కమీషన్ గుంజుతున్నారన్నారు. రూయా ఆస్పత్రిని వైసీపీ ఆస్పత్రిగా మార్చవద్దని కిరణ్ రాయల్ కోరారు. 

Updated Date - 2022-04-27T17:45:12+05:30 IST