గుంటూరు: సీఎం జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు వస్తే వాస్తవాలు తెలుస్తాయని జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు అన్నారు. తన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేలా సీఎం జగన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఉద్యోగులు పోరాటానికి జన సేన మద్దతు ఇచ్చిందని తెలిపారు. ఇష్టానుసారంగా మాట్లాడే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. 151 సీట్లు వచ్చిన జగన్ రెడ్డికి ఒక్క పవన్ కళ్యాణ్‌ను చూస్తే ఎందుకు భయం అని ప్రశ్నించారు. ఇంట్లో కూర్చునే బటన్ నొక్కడానికే సీఎం పరిమితమన్నారు. అన్నింటికీ సలహాదారులే పెత్తనం చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన పార్టీపై అవాకులు, చవాకులు పేలితే తిరుగుబాటు తప్పదని గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి