ప్రచారం కోసమే సంక్షేమ పథకాలు

ABN , First Publish Date - 2021-02-25T06:48:48+05:30 IST

రాష్ట్రంలో ప్రచారం కోసమే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని జన సేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు.

ప్రచారం కోసమే సంక్షేమ పథకాలు

అమలాపురం రూరల్‌, ఫిబ్రవరి 24: రాష్ట్రంలో ప్రచారం కోసమే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని జన సేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. రూ.1.80లక్షల కోట్లు అప్పులుచేసిన రాష్ట్ర ప్రభుత్వం అభివృ ద్ధిని పూర్తిగా విస్మరించిందన్నారు. చివరకు జీతాలు కూడా 11వ తేదీ వరకు చెల్లించలేని పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందన్నారు.  అమలాపురం, పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన తరుపున పంచాయతీల్లో విజయం సాధించిన అభ్యర్థుల సన్మాన కార్యక్రమం బుధవారం ఇందు పల్లిలోని ఏ1 కన్వెన్షన్‌ హాలులో నియోజకవర్గ ఇన్‌చార్జి శెట్టిబ త్తుల రాజబాబు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా  మనోహర్‌ మాట్లాడుతూ  జనసేన తరుపున ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో అర్థంకాని పరిస్థితి అని ఆరోపించారు. రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని ఏర్పాటు చేసిన పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే ఏప్రలోభాలకు లోన య్యారో తెలియదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో సదరు ఎమ్మె ల్యేకు ఓటర్లు తగిన గుణపాఠం చెప్పారన్నారు.  సమావేశంలో పార్లమెంటు ఇన్‌చార్జి డీఎంఆర్‌ శేఖర్‌, కొప్పుల నాగమానస, ఇసుకపట్ల రఘుబాబు తదితరులు ప్రసంగించారు. సమా వేశంలో నాయ కులు పంతం నానాజీ, పితాని బాలకృష్ణ, లింగోలు పండు, పిండి సాయిబాబా, యర్రా నాగబాబు, నల్లా శ్రీధర్‌, శిరిగినీడి వెంకటేశ్వరరావు, అరిగెల సూరిబాబు, పేరా బత్తుల దొరబాబు, ఆర్డీఎస్‌ ప్రసాద్‌, బట్టు పండు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయా నియోజకవర్గాల నుంచి జనసేన తరుపున సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు కింద ఎన్నికైన వారికి సత్కారం నిర్వహించారు. 

కార్పొరేషన్‌ నిధులు దారిమళ్లింపు  

ముమ్మిడివరం, ఫిబ్రవరి 24: పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ మద్యం, డబ్బులు పంపిణీ, దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడినా జనసైనికులు వాటిని ఎదురొడ్డి పోరాడడం అభినందనీయమని జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. ముమ్మిడివరం మహిపాలచెరువు ఎ-1 కన్వెన్షన్‌ హాలులో బుధవారం పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌ పితాని బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. బీసీ సంక్షేమ కార్పొరేషన్‌కు రూ.20వేల కోట్లు కేటాయిస్తానన్న ముఖ్యమంత్రి జగన్‌ ఆ నిధులు కేటాయించకుండా 56కార్పొరేషన్లు ఏర్పాటుచేశామని గొప్పలు చెప్పుకుంటూ, ఆ నిధులను రేషన్‌పంపిణీ వంటి ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తున్నారని అన్నారు. ఏడాది కాలంలో రూ.1.80లక్షల కోట్లు అప్పులు తెచ్చిన రాష్ట్రప్రభుత్వం కనీసం రోడ్లు కూడా ఆధునికీకరణ చేయలేని స్థితిలో ఉందన్నారు. ఇసుక, ఇళ్ల పట్టాలు వంటి వాటిలో డబ్బులు దండుకుంటూ వేలాది కోట్లు స్వాహా చేస్తున్నారని అన్నారు. అమలాపురం పార్లమెంటు ఇన్‌చార్జి డీఎంఆర్‌ శేఖర్‌ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ జీరో బడ్జెట్‌ పాలిటిక్స్‌ను తీసుకువచ్చి సామాన్య ప్రజలకు కూడా రాజకీయాలను అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు.  అనంతరం వేదికపై ముమ్మిడివరం నియోజకవర్గంలో జనసేన మద్దతుతో విజయం సాధించిన సర్పంచ్‌, వార్డు సభ్యులను దుశ్శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. సమావేశంలో కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పంతం నానాజీ, కడలి ఈశ్వరి, తుమ్మల బాబు, బండి రాధమ్మ, సానబోయిన మల్లికార్జునరావు, గోదాశి పుండరీష్‌, గుద్దటి జమ్మి, యలమంచిలి బాలరాజు, నూకల దుర్గ, పుణ్యవంతుల సూరిబాబు, రంబాల రమేష్‌, మచ్చా నాగబాబు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-25T06:48:48+05:30 IST