గందరగోళంగా పదవ తరగతి ఫలితాలు: Gade venkateshwar rao

ABN , First Publish Date - 2022-06-08T17:08:31+05:30 IST

పదవ తరగతి ఫలితాలు గందరగోళంగా ఉన్నాయని జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు అన్నారు.

గందరగోళంగా పదవ తరగతి ఫలితాలు: Gade venkateshwar rao

గుంటూరు: పదవ తరగతి ఫలితాలు గందరగోళంగా ఉన్నాయని జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు(Gade Venkateswar rao) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... పదకొండు, పదిహేడు మార్కులు వచ్చిన విద్యార్థులు పాస్ అయ్యారని తెలిపారు. తల్లిదండ్రులు పర్యవేక్షణ లోపంతోనే పదవ తరగతి ఫలితాలు తగ్గాయని మంత్రి బొత్స అంటున్నారని... మంత్రి వర్గం అవినీతికి పాల్పడటానికే ఉందా అని ప్రశ్నించారు. నాడు నేడు పేరుతో వేల కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. ఓట్ల కోసమే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలపై విమర్శ చేసే అర్హత సజ్జలకు ఉందా అని నిలదీశారు. ప్రభుత్వ సలహాదారు మీడియాతో మాట్లాడితే ప్రజాప్రతినిధులు ఏంచేస్తారన్నారు. సజ్జల సలహాలతో రాష్ట్రం భ్రష్టు పట్టిందని గాదె వెంకటేశ్వరరావు విమర్శలు గుప్పించారు. 

Updated Date - 2022-06-08T17:08:31+05:30 IST