అణగారిన వర్గాల అభ్యున్నతి జనసేనతోనే సాధ్యం

ABN , First Publish Date - 2021-07-28T05:38:57+05:30 IST

అణగారిన వర్గాల అభ్యున్నతి జనసేన పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ జిల్లా నూతన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు.

అణగారిన వర్గాల అభ్యున్నతి జనసేనతోనే సాధ్యం
జనసేన జిల్లా నూతన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావుని అభినందిస్తున్న పార్టీ నాయకులు

జనసేన జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు

గుంటూరు, జూలై 27 (ఆంధ్రజ్యోతి): అణగారిన వర్గాల అభ్యున్నతి జనసేన పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ జిల్లా నూతన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం బ్రాడీపేటలోని జనసేన కార్యాలయంలో పార్టీ దళిత నాయకుడు కొర్రపాటి నాగేశ్వరరావు నేతృత్వంలో నాయకులు ఆయన్ని ఘనంగా సన్మానించారు.  కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆళ్ల హరి, రామిరెడ్డి శ్రీనివాసరావు, కోనేటి ప్రసాద్‌, షఫ్రుద్దీన్‌, అన్వేష్‌, అంజి, రఘు, శెట్టి శ్రీను, హేమంత్‌ పాల్గొన్నారు.  

 

Updated Date - 2021-07-28T05:38:57+05:30 IST