Advertisement
Advertisement
Abn logo
Advertisement

కంభంపాటి, దత్తాత్రేయకు జనసేనాని అభినందనలు

అమరావతి: కంభంపాటి హరిబాబు మిజోరాం రాష్ట్ర గవర్నర్‌గా నియమితులు కావడం సంతోషకరమైన విషయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళవారం ఈ మేరకు పవన్ ఓ లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా హరిబాబుకి జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా విద్య, వైద్యం, స్కిల్ డెవలప్మెంట్ రంగాలపై దృష్టిపెట్టారన్నారు. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం అభివృద్ధిలో హరిబాబు అనుభవం ఎంతో దోహదపడుతుందనే విశ్వాసం ఉందన్నారు. 

బండారు దత్తాత్రేయకు శుభాకాంక్షలు

హరియాణా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న బండారు దత్తాత్రేయకి  జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. హరియాణా రాష్ట్ర అభివృద్ధిలో బండారు దత్తాత్రేయ తన వంతు పాత్రను పోషిస్తారనే నమ్మకం ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

Advertisement
Advertisement