Pawan Kalyan: ప్రేమానురాగాల సంగమం రక్షాబంధన్

ABN , First Publish Date - 2022-08-11T04:16:33+05:30 IST

ప్రేమానురాగాల సంగమం రక్షాబంధన్ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్బంగా..

Pawan Kalyan: ప్రేమానురాగాల సంగమం  రక్షాబంధన్

అమరావతి: ప్రేమానురాగాల సంగమం రక్షాబంధన్ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ కుటుంబాలు ఆత్మీయం, అనురాగాలతో పెనవేసుకుని ఉంటాయని ఆయన తెలిపారు. విదేశీయులు సైతం మన కుటుంబ వ్యవస్థను చూసి అబ్బురపడడం చూస్తూనే ఉంటామన్నారు. అక్కాచెల్లెళ్ళు, అన్నదమ్ముల ప్రేమానురాగాలు అపురూపమైనవని చెప్పారు. కష్టసుఖాల్లో సోదరుడు తోడుంటాడని ఒక భరోసా అని పవన్ తెలిపారు. అయితే సమాజంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ దుస్సంఘటనలు మనసును కలచివేస్తుయన్నారు. 


‘‘.ఏ ఆడపిల్లయినా సరే మన ఇంటి ఆడపడుచుగా చూడండి. వారు నిర్భయంగా జీవించే  మార్గాన్ని సుగమం చేయండి. ఈ శ్రావణ పూర్ణిమ భారతీయులందరికీ శుభాలు కలుగచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. 


Updated Date - 2022-08-11T04:16:33+05:30 IST