సుబ్రమణ్య భారతీయార్ గొప్ప జాతీయవాది: పవన్ కల్యాణ్

ABN , First Publish Date - 2021-09-14T00:27:19+05:30 IST

ప్రముఖ కవి సుబ్రమణ్య భారతీయార్ గొప్ప జాతీయవాది అని జనసేన అధినేత

సుబ్రమణ్య భారతీయార్ గొప్ప జాతీయవాది: పవన్ కల్యాణ్

అమరావతి: ప్రముఖ కవి సుబ్రమణ్య భారతీయార్ గొప్ప జాతీయవాది అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జాతీయ సమగ్రతను స్వప్నించిన మహాకవి సుబ్రమణ్య భారతీయార్ అని పవన్ పేర్కొన్నారు. అక్షరాలను శక్తిమంతంగా సంధించి, సామాజికంగా నెలకొన్న అలజడిని రూపుమాపి ప్రజా చైతన్యాన్ని తెచ్చిన గొప్ప జాతీయవాది అని ఆయన కొనియాడారు. సమాజానికి ఆ మహాకవి అందించిన రచనలు నేటికీ మన విద్యుక్త ధర్మాన్ని గుర్తు చేస్తాయని పేర్కొన్నారు. జాతీయ సమగ్రతను స్వప్నించిన ఆ మహాకవి శత వర్థంతి సంవత్సరం ఇది అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరం  సుబ్రమణ్య భారతీయార్‌ను స్మరించుకోవాలన్నారు. ఆ మహాకవికి తన తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తున్నట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-14T00:27:19+05:30 IST