ఎమ్మెల్యే రాంబాబును ప్రశ్నించిన జనసేన కార్యకర్త ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-19T06:23:58+05:30 IST

అధికార పా ర్టీకి చెందిన గిద్దలూ రు ఎమ్మెల్యే అన్నా రాంబాబు చేతిలో పరాభావానికి గురైన వారిలో ఒకరైన జన సేన కార్యకర్త బండ్ల వెంగయ్య నాయుడు (40) ఆత్మహత్య చేసుకున్నాడు.

ఎమ్మెల్యే రాంబాబును ప్రశ్నించిన జనసేన కార్యకర్త ఆత్మహత్య
వెంగయ్య మృతదేహం వద్ద విలపిస్తున్న భార్య

అధికారపార్టీ ఒత్తిళ్లతోనేనంటూ ఆ పార్టీ నేతల ఆరోపణ

మానసిక స్థితి బాగోలేక అంటున్న పోలీసులు, మృతుని భార్య

బేస్తవారపేట, జనవరి 18 : అధికార పా ర్టీకి చెందిన గిద్దలూ రు ఎమ్మెల్యే అన్నా రాంబాబు చేతిలో పరాభావానికి గురైన వారిలో ఒకరైన జన సేన కార్యకర్త బండ్ల వెంగయ్య నాయుడు (40) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బేస్తవారపేట మండలం శింగరపల్లెలో సోమవారం చోటు చేసుకొంది. దీనిపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా స్పందించడమే కాక, గ్రామానికి నాయకుల బృందాన్ని పంపుతున్నారు. శుక్రవారం శింగర పల్లెకు వెళ్లిన గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబును అభివృద్ధి పను లు ఎందుకు చేయరని జనసేన కార్యకర్తలు ప్రశ్నించారు. ఆ రోజు ముం దుండి ఎమ్మెల్యేను నిలదీసిన వారిలో వెంగయ్య ముఖ్యపాత్ర పోషించారు. చంద్రశేఖర్‌ అనే కార్యకర్త కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. వారిపై తీవ్ర ఆగ్రహావేశాలతో ఎమ్మెల్యే రాంబాబు రెచ్చిపోయారు. అనంతరం వారిద్దరిపై గ్రామంలోని వైసీపీ శ్రేణులు ఒత్తిడి పెంచారు. విషయం తెలుసుకొని వారిని పరామర్శించేందుకు జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బెల్లంకొండ సాయిబా బా, కొందరు నాయకులతో ఆదివారం ఉదయం ఆ గ్రామానికి వెళ్లగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన వాహనాన్ని అడ్డుకొన్నారు. గ్రామంలోకి వె ళ్లేందుకు రమారమి మూడు గంటలపాటు జనసేన నాయకులు ప్రయ త్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం జన సేన నాయకులు వెనక్కి వచ్చారు. ఆతర్వాత వైసీపీ నాయకులు గ్రామంలోని జనసేన కార్యకర్తలు అయిన వెంగయ్య నాయుడు, చంద్రశేఖర్‌ తదితరులపై ఒత్తిడి పెంచినట్లు తెలిసింది. మా ఎమ్మెల్యేనే నిలదీస్తారా అంటూ వారి కు టుంబ సభ్యులను బెదిరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం పొలం వెళ్లిన వెంగయ్య నాయుడు అక్కడే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయాన్ని తన అన్న వెంకటేశ్వర్లుకు ఫోన్‌ చేసి చెప్పాడు. ఆయన బంధువులతో కలిసి అక్కడికి వెళ్లేలోపే వెంగయ్య మృతి చెందాడు. ఈ సంఘటనపై జనసేన శ్రేణులు భగ్గుమన్నాయి. ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా స్పందించారు. గ్రామ సౌకర్యాలపై ప్రశ్నిం చిన తమ పార్టీ కార్యకర్తను వైసీపీ ఎమ్మెల్యే పొట్టనపెట్టుకున్నారని ధ్వజ మెత్తారు. వెంగయ్య నాయుడు మృతదేహానికి మంగళవారం ఉదయం కం భం ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. దీంతో జన సేన నాయకులతోపాటు, నియోజకవర్గం, జిల్లాలోని ఆపార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో కంభం ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లేందుకు సన్నద్ధమయ్యాయి. మరో వైపు వారిని అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం సన్నద్ధమైంది. దీంతో అటు శింగరపల్లె, ఇటు కంభంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. \


మానసిక స్థితి బాగోలేకే ఆత్మహత్య : పోలీసులు

 మద్యానికి బానిసై మానసిక పరిస్థితి అదుపు తప్పి వెంగయ్య ఆత్మ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు చెప్తున్నారు. వెంగయ్య ఆత్మహత్య చేసు కున్న కొన్ని గంటల్లోనే కుటుంబ సభ్యులు  ఆయన మద్యానికి బానిసై కొద్ది రోజులుగా మతిస్థిమితం కోల్పోయారని, తదనుగుణంగానే ఆత్మహత్యకు పా ల్పడ్డాడని చెప్పారు. ఆతర్వాత పోలీసులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐ టి. బాలకృష్ణ ప్రశ్నించగా అతిగా మద్యం సేవించి మతిస్థితిమితం తప్పి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు చెప్పారు.  


Updated Date - 2021-01-19T06:23:58+05:30 IST