అమరావతి: భవిష్యత్ ఆశల వారధి జనసేన ఆవిర్భావ సభ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు ప్రజల ఐక్యత, అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న సభ ఇదని తెలిపారు. రెండున్నరేళ్లలో ప్రజలు పడిన ఇబ్బందులపై గళమెత్తుతామని ప్రకటించారు. ఈ వేదిక నుంచే భవిష్యత్ రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తామని పవన్ తెలిపారు.
జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఈ నెల 14న మంగళగిరిలో నిర్వహించనున్నారు. సభ నిర్వహణ కోసం పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ 12 కమిటీలను నియమించారు. జిల్లాల సమన్వయ కమిటీలో పంతం నానాజీ, ముత్తా శశిధర్, నేమూరి శంకర్ గౌడ్, పెదపూడి విజయకుమార్, జి.ఉదయ్ శ్రీనివాస్, సుందరపు విజయ్‌కుమార్, వడ్రాణం మార్కండేయ బాబులను నియమించారు. ఆహ్వాన కమిటీలో టి.శివశంకర్‌తో పాటు మరో ఐదు మంది సభ్యులున్నారు.
ఇవి కూడా చదవండి