నూకాంబిక ఆలయానికి జనమే..జనం

ABN , First Publish Date - 2021-04-19T05:10:15+05:30 IST

ఉత్తరాంధ్రుల ఇలవేల్పు అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు.

నూకాంబిక ఆలయానికి జనమే..జనం
నూకాంబికను దర్శించుకుంటున్న భక్తులు


 

 అనకాపల్లి రహదారులు కిటకిట

  రోడ్డుపైకి చేరిన భక్తుల క్యూలైన్‌

  ఉదయం నుంచి సాయంత్రం వరకు సందడే సండి

అనకాపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 18 : ఉత్తరాంధ్రుల ఇలవేల్పు అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి జిల్లా నలుమూలల నుంచి వస్తూనే ఉన్నారు. క్యూలైన్లు నిండిపోవడంతో రోడ్డుపై కూడా  క్యూ కట్టారు. సాయంత్రం  ఐదు గంటలు దాటినా ఆలయ ఆవరణలో సందడి తగ్గలేదు. క్యూలో ఉన్న భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఆలయ ఈవో బీఎల్‌ నగేశ్‌ ఆధ్వర్యంలో సిబ్బంది మంచినీటిని సరఫరా చేశారు. జాతర ప్రత్యేకాధికారిణి ఎస్‌.జ్యోతిమాధవి భక్తులకు అందుతున్న సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. పలువురు భక్తులు ఆలయ ఆవరణలో  వంటలు వండుకుని అమ్మవారికి నైవేథ్యంగా సమర్పించారు.  ఆలయ బేడా మండపంలో డాక్టర్‌ కె.విష్ణుమూర్తి ఆలపించిన భక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. పట్టణ ఎస్‌ఐలు ఎల్‌.రామకృష్ణ, ఆర్‌.ధనుంజయ్‌ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.  ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా సీఐ సీహెచ్‌.ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ స్వామినాయుడు చర్యలు తీసుకున్నారు. 


Updated Date - 2021-04-19T05:10:15+05:30 IST