Janakiని మరచిన అన్నాడీఎంకే

ABN , First Publish Date - 2021-12-01T16:02:56+05:30 IST

దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ సతీమణి, మాజీ ముఖ్యమంత్రి జానకి రామచంద్రన్‌ను అన్నాడీఎంకే విస్మ రించింది. ఆమె 93వ జయంతిని కనీసం స్మరించు కోలేకపోయింది. అయితే ఆ పార్టీకి చేరువయ్యేందుకు తీవ్రంగా

Janakiని మరచిన అన్నాడీఎంకే

               - ఆమె సేవలు స్మరించుకున్న చిన్నమ్మ


చెన్నై: దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ సతీమణి, మాజీ ముఖ్యమంత్రి జానకి రామచంద్రన్‌ను అన్నాడీఎంకే విస్మ రించింది. ఆమె 93వ జయంతిని కనీసం స్మరించుకోలేకపోయింది. అయితే ఆ పార్టీకి చేరువయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న చిన్నమ్మ వీకే శశికళ మాత్రం జానకి రామచంద్రన్‌ను తలచుకుని, ఆమెకు నివాళులర్పించారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఓ ప్రకటన విడుదల చేయడం అన్నాడీఎంకేలో చర్చనీయాంశమైంది. జానకి రామచంద్రన్‌ జయంతిని అన్నాడీఎంకే నాయకులెవరూ పట్టించుకోలేకపోయారని శశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పేరుతో పత్రికలకు ప్రకటన చేయడం గమనార్హం. జానకి రామచంద్రన్‌ జయంతిని పురస్కరించుకుని అన్నాడీఎంకే శ్రేణులందరికీ తాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. 1972లో ఎంజీఆర్‌ అన్నాడీఎంకే పార్టీని ప్రారంభించినప్పుడు జానకి రామచంద్రన్‌ పార్టీ సభ్యత్వం స్వీకరించి ఆయనకు అండగా నిలిచారని శశికళ సందేశంలో తెలిపారు. టి.నగర్‌లోని ఎంజీఆర్‌ స్మారక భవనం, రామాపురంలోని మూగ, బధిర విద్యార్థుల పాఠశాలను సమర్థవంతంగా జానకి రామచంద్రన్‌ నడిపారని తెలిపారు. 

Updated Date - 2021-12-01T16:02:56+05:30 IST