జన గళమున జనగణమన

ABN , First Publish Date - 2022-08-17T04:50:00+05:30 IST

ఎప్పుడూ చూడని అరుదైన ఘట్టం కళ్లముందు ఆవిష్కృతమైంది.

జన గళమున జనగణమన
జాతీయగీతాలాపన కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఉదయ్‌ కుమార్‌

- ఏకకాలంలో వేలాది మంది జాతీయ గీతాలాపన

- నిమిషం పాటు ఎక్కడికక్కడ ఆగిన జనజీవనం

నాగర్‌కర్నూల్‌టౌన్‌, ఆగస్టు 16: ఎప్పుడూ చూడని అరుదైన ఘట్టం కళ్లముందు  ఆవిష్కృతమైంది. వేలా ది గొంతుకలు ఏకకాలంలో జాతీయ గీతాన్ని ఆలపిం చి, దేశభక్తిని చాటుకున్నాయి. ప్రతీ ఒక్కరు జాతీయ జెండా చేతబూని, జైబోలో భారత్‌మాతాకీ జై అంటూ నినదించడంతో జాతీయ భావం ఉప్పొంగింది. వజ్రో త్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం ఉదయం 11:30 గంటలకు ఎక్కడున్నవారు అక్కడే సామూ హికంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. దారిన వెళ్లే వారు సైతం తమ వాహనాలను పక్కన ఆపి, ఈ అరుదైన కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. చిన్న, పెద్ద, కులం, మతం తేడా లేకుండా పాల్పం చుకున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ఎక్కడి కక్కడ ప్రజలు ఆగిపోయి జాతీయ గీతాన్ని పాడారు. కలెక్టరేట్‌ ఎదురుగా ప్రధాన రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన వేదిక నుంచి కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌, ఎస్పీ మనోహర్‌, స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో కలిసి సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. అలాగే పట్టణంలోని ప్రధాన రహదారి కూడళ్ల వద్ద విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ గీతాన్ని పాడారు. ఈ సందర్భంగా  కలెక్టర్‌ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా జాతీయ గీతాలాపనలో పాల్గొని దేశభక్తి చాటడం సంతోషదాయకమన్నారు. ఇదే స్ఫూర్తితో వజ్రోత్సవాల్లో భాగంగా 22వరకు జరగనున్న కార్యక్రమాలను విజయవంతం చేయా లని కలెక్టర్‌ కోరారు. ఎమ్మెల్యే మర్రి  జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాల ర్పించిన మహనీయులను స్మరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలను నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మనూచౌదరి, మోతీలాల్‌, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.  















Updated Date - 2022-08-17T04:50:00+05:30 IST