Abn logo
Oct 18 2021 @ 10:46AM

జనగామ జిల్లాలో ప్రయాణీకులకు తప్పిన పెను ప్రమాదం

జనగామ: జిల్లాలో ప్రయాణీకులకు పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రయాణీకులు కేకలు వేయడంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేశాడు. దీంతో ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ప్రయాణీకుల లగేజీలు స్వల్పంగా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి బస్సు పూర్తిగా కాలిపోయింది. ఛత్తీస్‌గఢ్ జగదల్‌పూర్‌కు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...