Abn logo
Apr 11 2021 @ 01:16AM

సీఎం పదవినే త్యాగం చేసిన జానా

 మచ్చలేని నాయకుడిగా పేరు 

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
హాలియా / మాడ్గులపల్లి / పెద్దవూర / త్రిపురారం,ఏప్రిల్‌ 10 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జానారెడ్డి సీఎం పదవిని సైతం త్యాగం చేశారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన అనుముల మండలంలోని పులిమామిడి, మారేపల్లి, యాచారం గ్రామంలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. నాడు సోనియాగాంధీ జానారెడ్డిని సీఎం పదవి తీసుకోమన్నా తనకు తెలంగాణ వస్తే చాలు అన్న వ్యక్తి అన్నారు. జానా మచ్చలేని నాయకుడన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో బానిస బతుకులు మారాలంటే ప్రజల్లో మార్పు రావాలని సూచించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2లక్షల ఉద్యోగాలు  భర్తీ చేయకపోవడంతో మూడు పసిప్రాణాలు గాలిలో కలిశాయన్నారు. శ్రీశైలం సొరంగం పూర్తి కావడానికి వెయ్యి కోట్లు కేటాయించ లేకపోయారని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలులో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ జేఏసీ జానా ఇంట్లో పుట్టిందన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు డబ్బు సంచులతో వచ్చినా జానాకే ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ మాలె అరుణ, మండల అధ్యక్షుడు కుందూరు వెంకట్‌రెడ్డి, మాఽధవి పాల్గొన్నారు. మాడ్గులపల్లి మండలంలోని గజలాపురం, అభంగాపురం, పూసలపాడు గ్రామాల్లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ ఇంటింటి ప్ర చారం చేశారు. ఉప ఎన్నికలో జానారెడ్డి విజయం ఖాయమన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పుల్లెంల సైదులు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గడ్డం వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్దవూర మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిఽధి కల్వ సుజాత ప్రచారం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పెరిక వెంకటేశ్వర్లు, కన్వీనర్‌ ఏకుల సురేష్‌, మండల నాయకు లు నడ్డి ఆంజనేయులు, కిరణ్‌కుమార్‌, వెంకటయ్య, శేఖర్‌, సతీష్‌, రమేష్‌ పాల్గొన్నారు. త్రిపురారం మండలంలో కాంగ్రెస్‌ నాయకుడు బీఎల్‌ఆర్‌ ప్రచారం చేశారు.

Advertisement
Advertisement