కరపత్రాలు విడుదల చేస్తున్న కృష్ణకిషోర్‌తదితరులు
గుంటూరు(విద్య), జూలై 5: జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభలు ఈ నెల 9, 10 తేదీల్లో గుంటూరులో నిర్వహిస్తున్నట్లు జాతీయ ప్రధాన కార్యదర్శి జంపా కృష్ణకిషోర్ వెల్లడించారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడున్నర దశాబ్దాలపాటు ప్రజల్లో చైత్యనం తీసుకువచ్చేందుకు కృషి చేశామని వివరించారు. గుంటూరులో జరిగే సభల్ని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర మహాసభలకు గౌరవ అధ్యక్షులు పి.రామమోహనరావు, డాక్టర్ వి.బ్రహ్మారెడ్డి, ఆకుసూరి శంకరయ్య, జనచైతన్య వేదిక వ్యవస్థాపకులు వి.లక్ష్మణరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు హాజరుకానున్నట్లు తెలిపారు.