ఎస్సీ, ఎస్టీలకు సత్వర న్యాయానికి జన అదాలత్‌

ABN , First Publish Date - 2020-12-03T06:11:24+05:30 IST

రాష్ట్రంలోని దళిత, గిరిజనులకు సత్వర మే న్యాయం అందించేందుకు జన అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తెలిపారు.

ఎస్సీ, ఎస్టీలకు సత్వర న్యాయానికి జన అదాలత్‌
నల్లగొండ జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ 

నల్లగొండ క్రైం, డిసెంబరు 2: రాష్ట్రంలోని దళిత, గిరిజనులకు సత్వర మే న్యాయం అందించేందుకు జన అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తెలిపారు. బుధవారం ఆయన నల్లగొండ జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. సమైక్య పాలనలో కేవలం హైదరాబాద్‌కే పరిమితమైన కమిషన్‌ రాష్ట్రంలో గ్రామ స్థాయిలో సైతం అణగారిన వర్గాలకు న్యాయం చేయడం లో ముందు ఉందన్నారు. సమైక్య పాలనలో రాష్ట్రం ఎంత వివక్షకు గురైందో దళిత, బహుజనులు, గిరిజనులు సైతం అంతే వివక్షకు గురయ్యారన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు దళిత, గిరిజనులు సంపూర్ణంగా వినియోగించుకునేలా కమిషన్‌ పని చేస్తోందన్నారు. 2014–2018కు ముందు 10,500 కేసులు పెండింగ్‌లో ఉంటే ఎనిమిది వేల పైచిలుకు కేసులు పరిష్కరించి  రూ.55.66కోట్ల పరిహారం ఇప్పించామన్నా రు. పీసీ, పీవో యాక్టును కిందిస్థాయిలో సమగ్రంగా అమలుచేస్తే దళితులపై దాడులను అరికట్టవచ్చన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహించి పెండింగ్‌ కేసులపై సమీక్షించి దేశంలోనే మిగిలిన రాష్ర్టాలకు తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు. దూర ప్రాంతాల వారికి ఇబ్బందు లు వస్తున్న నేపథ్యంలో వారి వద్దకే వెళ్లి సమస్యల పరిష్కారానికి జన అదాలత్‌ నిర్వహించి న్యాయం చేస్తున్నామని, మొట్టమొదటి గా జన అదాలత్‌ను ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో ప్రారంభించి న్యాయం చేశామన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతినిధులు సైతం తెలంగాణ కమిషన్‌ పనితీరుకు కితాబిచ్చారని, దళితులు, గిరిజనులు ఈ కమిషన్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

Updated Date - 2020-12-03T06:11:24+05:30 IST