వైష్ణో దేవి ఆలయానికి రోజుకు 5 వేల మంది భక్తులకు అనుమతి

ABN , First Publish Date - 2020-08-12T03:06:21+05:30 IST

జమ్మూ-కశ్మీరులోని దేవాలయాలు, ప్రార్థనా స్థలాలను ఈ నెల 16 నుంచి భక్తుల కోసం తెరవాలని

వైష్ణో దేవి ఆలయానికి రోజుకు 5 వేల మంది భక్తులకు అనుమతి

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరులోని దేవాలయాలు, ప్రార్థనా స్థలాలను ఈ నెల 16 నుంచి భక్తుల కోసం తెరవాలని కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. సందర్శకులు తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్‌ను వినియోగించాలని తెలిపింది. 


త్రికూట కొండల్లోని శ్రీ మాత వైష్ణో దేవి ఆలయానికి రోజుకు గరిష్ఠంగా 5,000 మందిని అనుమతించాలని జమ్మూ-కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంతం ప్రభుత్వం నిర్ణయించింది. కాట్రా సమీపంలోని ఈ దేవాలయానికి ఈ నెల 16 నుంచి సెప్టెంబరు 30 వరకు భక్తులను అనుమతించాలని నిర్ణయించింది. 


దేవాలయాలు, ప్రార్థనా స్థలాలను ఈ నెల 16 నుంచి భక్తుల కోసం తెరవాలని నిర్ణయించడంతో వ్యాపారులు, పర్యాటక రంగ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, కోవిడ్-19 మహమ్మారి సమయంలో తామంతా చాలా అవస్థలు పడుతున్నామని చెప్తున్నారు. 


Updated Date - 2020-08-12T03:06:21+05:30 IST