జూరాల ప్రధాన కుడికాల్వలో పెరిగిన జమ్ము

ABN , First Publish Date - 2022-05-16T05:34:20+05:30 IST

జూరాల ప్రధాన కుడికాల్వలో పూడిక, జమ్ము పేరుకుపోయింది.

జూరాల ప్రధాన కుడికాల్వలో పెరిగిన జమ్ము
మునుగాల శివారులో ప్రధాన కాలువలో పెరిగిన జమ్ము

 - వెదజల్లుతున్న దుర్వాసన

- చివరి ఆయకుట్టుకు అందని నీరు

- డిస్ర్టిబ్యూటర్ల పరిస్థితి మరీ దారుణం

- మరమ్మతుకు చర్యలు తీసుకోవాలని వేడుకోలు


ఇటిక్యాల,మే 15: జూరాల ప్రధాన కుడికాల్వలో పూడిక, జమ్ము పేరుకుపోయింది.  దాని కారణంగా సాగునీటికి  ఆటంకంగా మారిందని ఇటిక్యాల మండలం ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్వకు నీరు లేకపోవడంతో దుర్గంధం వెదజల్లుతుండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.  

ఇటిక్యాల మండలం పరిధిలో జూరాల ప్రధాన కుడికాలువ ఉండటంతో మొగిలిరావులచెర్వు, శివనంపల్లి,మునుగాల, నక్కలపల్లి, కోదండాపురం, వేముల, పుటాన్‌దొడ్డి, దువాసిపల్లి, వీరాపురం, కోండేరు, జింకలపల్లి, ధర్మవరం, గార్లపాడు తదితర గ్రామాల పొలాలలకు నీరు చేరుతుంది. కొన్ని ఏళ్లుగా ప్రధాన కాలువతో పాటు డిస్ర్టిబ్యూటరీ కాల్వలు సైతం పూడిక, జమ్ముతో నిండి ఉండటంతో  నీటి ప్రవాహనికి అడ్డంకిగా మారడంతో సాగునీరు చివరి ఆయకట్టుకు అందని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. జమ్ము, పూడిక తొ లగించాలని పలుమార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. మునుగాల గ్రామ శివారులో 39 కిలో మీటరు పరిధిలో కాలువలో జమ్ము, పూడికతో   దుర్వాసన వెదజల్లుతున్నా అధికారులు పట్టించుకోవ డం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.  ప్రధాన కాలువ దుస్థితి ఇలా ఉంటే డిస్ర్టిబ్యూటర్ల పరిస్థితి మరి అ ధ్వానంగా ఉంటుందని రైతులు తెలుపుచున్నారు. వేస విలో కాల్వలో నీరు లేకపోవడంతో పూడిక, జమ్ము తొల గించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవా లని కోరుతున్నారు. రైతుల ప్రజయోజనాలను దృష్టిలో ఉంచుకొని వానాకాలం సాగునీరు విడుదల చేయకముందే మరమ్మతు పనులు చేపట్టాలని ఆయా గ్రామాల రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

 చివరి ఆయకట్టు రైతుల బాధ వర్ణనాతీతం

ప్రధాన కుడి కాలువ ఇటిక్యాల మండలంలో రైతులకు ప్రయోజనకరంగా ఉన్నది. అయిదు సంవత్సరాలనుంచి డిస్ర్టిబ్యూటరీల  స్థితి బాగు లేదు.  పూడిక, ముళ్ల పొదలు, జమ్ము పెరిగిపోయినా  తొలగించేవారు లేరు.  చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. వేసవిలో దృష్టి సారిస్తే కొంత ప్రయోజనం ఉంటుంది. 

- లక్ష్మణ, సాసనూలు 

 పట్టించుకోవడం లేదు  

జూరాల ప్రధాన కుడికాలువ పరిధిలో డిస్ర్టిబ్యూటరి 34 నుంచి 35,36 పరిధిలో ఎక్కువగా జమ్ము, ముళ్ల పొదలు పెరిగాయి. తొలగించాలని సంబంధిత అధికారులకు  రెండు సంవత్సరాల నుంచి విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదు. సాగు నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉంది.  రైతుల ఇబ్బందులు గుర్తించి మరమ్మతు చర్యలు తీసుకోవాలి.  

- లక్ష్మీనారాయణ రెడ్డి, మునుగాల 

Updated Date - 2022-05-16T05:34:20+05:30 IST