శ్రీనగర్: హవాలా లావాదేవీల కేసులో జమ్మూకశ్మీర్ మాజీ మంత్రి బాబుసింగ్ పేరు తెరపైకి వచ్చింది. హవాలా లావాదేవీల కేసులో అనుమానితుడిగా ఉన్న జమ్మూ కాశ్మీర్ మాజీ మంత్రి బాబు సింగ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. జమ్మూ అండ్ కశ్మీర్ పోలీసులు గురువారం 64 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.7 లక్షల విలువైన హవాలా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మాజీమంత్రి సింగ్‌కు సంబంధాలున్నాయని తేలింది. జమ్మూలో కొందరు వ్యక్తులు హవాలా డబ్బును స్వీకరించబోతున్నారనే సమాచారం ఆధారంగా జమ్మూ నగరంలో పలు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.
అటువంటి చెక్ పోస్ట్ వద్ద గాంధీ నగర్ ప్రాంతం నుంచి అనంత్‌నాగ్‌లోని సయ్యద్పోరాకు చెందిన మహ్మద్ షరీఫ్ షా (64) అనే వ్యక్తిని పోలీసులు అడ్డగించి అతని నుంచి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ అండ్ కశ్మీర్‌లోని పీడీపీ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో మాజీ మంత్రి అయిన జతీందర్ సింగ్ అకా బాబు సింగ్ శ్రీనగర్‌లోని ఒమర్ అనే వ్యక్తి నుంచి డబ్బు వసూలు చేసే పనిని తనకు అప్పగించినట్లు షా వెల్లడించారు. ఒమెర్ నుంచి డబ్బు అందుకున్న షరీఫ్ జమ్మూకి వచ్చాడు.హవాలా కేసులో జమ్మూకశ్మీర్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఇవి కూడా చదవండి