Abn logo
Sep 17 2021 @ 00:24AM

ఊరు ఊరికి జమ్మిచెట్టు.. గుడి గుడికో జమ్మిచెట్టు

పోస్టర్‌ విడుదల చేస్తున్న రాఘవ

  • గ్రీస్‌ చాలెంజ్‌ కో-ఫౌండర్‌ రాఘవ

షాబాద్‌ : ఊరు ఊరికి జమ్మిచెట్టు.. గుడి గుడికో జమ్మిచెట్టు అనే నినాదం ప్రతి ఊరు, వాడలో కొనసాగాలని గ్రీస్‌ చాలెంజ్‌ కో-ఫౌండర్‌ రాఘవ, సీనియర్‌ జర్నలిస్ట్‌ యాస మల్లారెడ్డి అన్నారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ వ్యవస్థాపకులు, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతో్‌షకుమార్‌ పిలుపు మేరకు గురువారం హైదరాబాద్‌లో గ్రీన్‌ చాలెంజ్‌కు సంబంధించి పోస్టర్‌ విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణలోని ప్రతి దేవాలయంలో శమీవృక్షం(జమ్మిచెట్టు) అందుబాటులో ఉండాలనే సంకల్పంతో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కల పంపిణీకి  శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో జమ్మిచెట్లను నాటే కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.