స్థానిక, జమిలి ఎన్నికలకు సిద్ధంకండి

ABN , First Publish Date - 2020-11-30T07:13:02+05:30 IST

రాష్ట్రంలో స్థానిక, దేశంలో జమిలి ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా వుండాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

స్థానిక, జమిలి ఎన్నికలకు సిద్ధంకండి

మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

బిక్కవోలు, నవంబరు 29: రాష్ట్రంలో స్థానిక, దేశంలో జమిలి ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా వుండాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం పందలపాకలో టీడీపీ మండల అధ్యక్షుడు కొవ్వూరి వేణుగోపాలరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలందరూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి నిత్యం వారితో సన్నిహితంగా వుంటే టీడీపీ విజయం తథ్యమన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ బేరా వేణమ్మ, వైస్‌ ఎంపీపీ చింతా శ్రీనివాసరెడ్డి, అనుసూరి నాగేశ్వరరావు, పడాల ఆదినారాయణరెడ్డి, పాలచర్ల శివప్రసాద్‌చౌదరి, రెడ్డి శ్రీను, కానేటి అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-30T07:13:02+05:30 IST