Jul 27 2021 @ 16:15PM

అక్టోబర్‌లో బాండ్‌ వస్తున్నాడు!

జేమ్స్‌ బాండ్‌ సిరీస్‌ ‘నో టైమ్‌ టు డై’ విడుదల ఎట్టకేలకు ఖరారైంది. గత ఏడాది ఏప్రిల్‌ 20న విడుదల కావలసిన ఈ చిత్రం కరోనా మహమ్మారి కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఓటీటీలో  స్ట్రీమింగ్‌ కానుందని కూడా వార్తలొచ్చాయి. దీనిని ఖండించిన నిర్మాత బార్‌బరా బ్రోకలి అక్టోబర్‌లో థియేటర్ల ద్వారా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. ఈ మేరకు మంగళవారం కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు. యాక్షన్‌ ప్యాక్డ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో డేనియల్‌ క్రేగ్‌  హీరోగా నటించడమే కాకుండా సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ చిత్రం అమెరికాలో అక్టోబర్‌ 8న విడుదలవుతుండగా, అక్కడి కన్నా ముందే సెప్టెంబర్‌ 30న యు.కెలో ఈ చిత్రాన్ని విడదల చేయనున్నారని తెలిసింది.