నేను ‘ఆ టైపు‘ కాదు! కానీ, ‘గే’ బార్స్‌కే వెళతాను! ఎందుకంటే... : జేమ్స్ బాండ్

జేమ్స్ బాండ్‌గా ప్రపంచాన్ని ఇంతకాలం అలరించిన డేనియల్ క్రెయిగ్ పనిగట్టుకుని ‘గే’ బార్స్‌కి వెళతాడట! స్ట్రెయిట్ క్లబ్స్‌కి ఉద్దేశ్యపూర్వకంగానే వెళ్లడట! గే బార్స్‌కి వెళితే ‘అగ్రెసివ్ మెన్’ ఉండరని క్రెయిగ్ చెబుతున్నాడు. చిత్తుగా తాగేసి... తరువాత కావాలని గొడవలు పడే మగాళ్లు... ఎక్కువగా నార్మల్ బార్స్‌లోనే ఉంటారని బాండ్ అంటున్నాడు. అటువంటి వారితో దెబ్బలాట వద్దనే, చాలా ఏళ్లుగా 007, హోమో సెక్సువల్స్ ఉండే గే బార్స్‌కి వెళుతున్నాడట. అక్కడైతే తనని ఎవ్వరూ పెద్దగా డిస్టబ్ చేయరట. అంతే కాదు, మరో సెక్సీ సీక్రెట్ కూడా బయటపెట్టాడు ఈ సీక్రెట్ ఏజెంట్. అదేంటంటే... తాగుబోతు మగవాళ్ల రచ్చ వద్దనుకునే చాలా మంది హాట్ గాళ్స్ కూడా గే బార్స్‌కి వస్తుంటారట. వాళ్లు స్వలింగ సంపర్కులు కారు. మామూలు లేడీసే. అటువంటి వార్ని మెల్లగా లైన్‌లో పెడుతుంటాడట 53 ఏళ్ల రసికుడు!


2006 నుంచీ 2021 దాకా, ఒకటిన్నర దశాబ్దాం పాటూ, జేమ్స్ బాండ్‌గా ప్రపంచాన్ని ఎంటర్టైన్ చేసిన డేనియల్ క్రెయిగ్ ‘నో టైం డూ డై’ సినిమాతో ‘007’ పాత్రకి గుడ్ బై చెప్పేశాడు. జేమ్స్ బాండ్‌ ఫ్రాంఛైజ్‌లో నెక్ట్స్ సినిమాకి సరికొత్త సీక్రెట్ ఏజెంట్ రానున్నాడు. ఆ నటుడు ఎవరోనన్న ఉత్కంఠ ప్రస్తుతం అంతటా నెలకొంది.   

Advertisement