జామ్, బటర్... ఏది బెటర్?
ABN , First Publish Date - 2021-04-13T06:38:30+05:30 IST
ఎక్కువ శాతం ఇళ్లలో పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌గా బ్రెడ్, బటర్ లేదా జామ్‌తో తినిపిస్తూ ఉంటారు. అయితే బ్రెడ్ మీద పైపూతగా జామ్, బటర్...
ఎక్కువ శాతం ఇళ్లలో పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌గా బ్రెడ్, బటర్ లేదా జామ్‌తో తినిపిస్తూ ఉంటారు. అయితే బ్రెడ్ మీద పైపూతగా జామ్, బటర్... ఈ రెండిటిలో ఏది ఆరోగ్యకరం? పండ్లతో తయారయ్యే జామ్ మంచిదా? లేదా వేరుసెనగపప్పుతో తయారయ్యే పీనట్ బటర్ లేదా పాలతో తయారయ్యే వెన్న మంచిదా? అంటే కచ్చితంగా బటర్ మంచిది అని చెప్పవచ్చు. జామ్ ఎక్కువగా తింటూ పెరిగే పిల్లలు ఊబకాయులుగా మారడమే కాకుండా, గుండెజబ్బులకూ గురయ్యే అవకాశాలు ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు కారణం జామ్‌లో పోషకాలు తక్కువగా, క్యాలరీలు ఎక్కువగా ఉండడమే! అదే బటర్‌లో పోషకాలు, ప్రొటీన్లతో పాటు అరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజలవణాలు కూడా ఉంటాయి. హైడ్రోజినేటెడ్ ఆయిల్స్, పామాయిల్, హై ఫ్రక్టోజ్, కార్న్ సిరప్ ఉన్న బటర్ కొనొద్దు. అలాగే ఉప్పు తక్కువగా ఉండే బటర్స్‌నే ఎంచుకోవాలి.