కోలాహలంగా తిరుమానూరు జల్లికట్టు

ABN , First Publish Date - 2022-03-06T16:08:02+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా వాయిదావేసిన తిరుమానూర్‌ జల్లికట్టు పోటీలు శనివారం కోలాహలంగా సాగాయి. అరియలూరు జిల్లా తిరుమానూర్‌ మాసి అమావాస్య సందర్భంగా జల్లికట్టు నిర్వహించడం

కోలాహలంగా తిరుమానూరు జల్లికట్టు

పెరంబూర్‌(చెన్నై): మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా వాయిదావేసిన తిరుమానూర్‌ జల్లికట్టు పోటీలు శనివారం కోలాహలంగా సాగాయి. అరియలూరు జిల్లా తిరుమానూర్‌ మాసి అమావాస్య సందర్భంగా జల్లికట్టు నిర్వహించడం ఆనవాయితీ. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా వాయిదా వేసిన ఈ పోటీలు శనివారం నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యే చిన్నప్ప, జిల్లా కలెక్టర్‌ రమణ సరస్వతి పోటీలు ప్రారంభించారు. అరియలూరు, పెరంబలూరు, తంజావూరు, పుదుకోట, తిరుచ్చి సహా పలు జిల్లాలకు చెందిన 500 ఎద్దులు పాల్గొనగా, వాటిని అదుపుచేసేందుకు 250 యువకులు సాహసించారు. పోటీలకు ముందుగా ఎద్దులు, క్రీడాకారులకు వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరమే అనుమతించారు.

Updated Date - 2022-03-06T16:08:02+05:30 IST