జల్లికట్టులో అపశ్రుతి.. ఎద్దు కుమ్మి యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-01-19T16:58:16+05:30 IST

తిరుచ్చి జిల్లా నవలూరు గ్రామంలో పొంగల్‌ సందర్భంగా మంగళవారం నిర్వహించిన జల్లికట్టు పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది. ఈ పోటీ తిలకించేందుకు వెళ్లిన వినోద్‌ (24) అనే యువకుడు ఎద్దు కుమ్మడంతో అక్కడికక్కడే మరణించాడు.

జల్లికట్టులో అపశ్రుతి.. ఎద్దు కుమ్మి యువకుడి మృతి

ప్యారీస్‌(చెన్నై): తిరుచ్చి జిల్లా నవలూరు గ్రామంలో పొంగల్‌ సందర్భంగా మంగళవారం నిర్వహించిన జల్లికట్టు పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది. ఈ పోటీ తిలకించేందుకు వెళ్లిన వినోద్‌ (24) అనే యువకుడు ఎద్దు కుమ్మడంతో అక్కడికక్కడే మరణించాడు. నవలూరు కుట్టపట్టు ప్రాంతంలో మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభించాల్సిన జల్లికట్టు పోటీలు ఆలస్యంగా 10.30 గంటలకు మొదలయ్యాయి. తిరుచ్చి జిల్లాకు చెందిన 300 ఎద్దులు, 150 మంది యువకులను కొవిడ్‌ నిబంధనల మేరకు మైదానంలోకి అనుమతించారు. ముందుగా యువకుల చేత ప్రతిజ్ఞ చేయించి, మణికంఠం పంచాయతీ ఛైర్మన్‌ మాతూర్‌ సుబ్బయ్య పోటీలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో, పోటీలు తిలకించేందుకు వెళ్లిన ప్రేక్షకుల్లో ఎద్దు కుమ్మి అదే ప్రాంతానికి చెందిన వినోద్‌ అనే యువకుడు మరణించడం అందరినీ కలచివేసింది. 

Updated Date - 2022-01-19T16:58:16+05:30 IST