జల్‌జీరా

ABN , First Publish Date - 2021-04-03T19:21:25+05:30 IST

ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో చల్లటి పానీయాలు తాగాలని అనిపిస్తుంది. జల్‌జీరా, సత్తు షర్బత్‌, ఆమ్‌ పన్నా, రూహ్‌ అఫ్జా మోజిటో, లస్సీ, మల్బరీ జ్యూస్‌ లాంటివి ఒంటికి చల్లదనాన్ని ఇచ్చేవే. శరీరానికి సత్తువను కూడా ఇచ్చే ఈ డ్రింక్స్‌ వేసవితాపం నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. ఇంకెందుకాలస్యం ఈ వారం మీరూ వీటిని రుచి చూడండి.

జల్‌జీరా

చల్లచల్లగా...తనివితీరగా...!

ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో చల్లటి పానీయాలు తాగాలని అనిపిస్తుంది. జల్‌జీరా, సత్తు షర్బత్‌, ఆమ్‌ పన్నా, రూహ్‌ అఫ్జా మోజిటో, లస్సీ, మల్బరీ జ్యూస్‌ లాంటివి ఒంటికి చల్లదనాన్ని ఇచ్చేవే. శరీరానికి సత్తువను కూడా ఇచ్చే  ఈ డ్రింక్స్‌ వేసవితాపం నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. ఇంకెందుకాలస్యం ఈ వారం  మీరూ  వీటిని రుచి చూడండి. 

చల్లదనంతో పాటు రోగనిరోధకశక్తిని పెంచే డ్రింక్‌ జల్‌జీరా. ఇంట్లో లభించే పదార్థాలతో తయారుచేసుకోగలిగే ఈ డ్రింక్‌ను పిల్లలు, పెద్దలు ఇష్టంగా తాగుతారు. 

కావలసినవి: పుదీనా - ఒక కట్ట, నిమ్మరసం - కొద్దిగా, ఉప్పు - రుచికి తగినంత, నీళ్లు - రెండు గ్లాసులు, జీలకర్ర - రెండు టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర - ఒక కట్ట, అల్లం - కొద్దిగా, పంచదార - నాలుగు టేబుల్‌స్పూన్లు, ఇంగువ - చిటికెడు, చింతపండు - కొద్దిగా.

తయారుచేయు విధానం: పుదీనా, కొత్తిమీర శుభ్రంగా కడిగి కట్‌ చేసి పెట్టుకోవాలి. జీలకర్రను వేగించాలి. మిక్సీలో పుదీనా, కొత్తిమీర, చింతపండు వేసి పట్టుకోవాలి. వేగించిన జీలకర్ర, అల్లం ముక్క వేసి మరోసారి బ్లెండ్‌ చేయాలి. ఇంగువ, ఉప్పు, పంచదార, నిమ్మరసం వేసి, నీళ్లు పోసి మరోసారి పట్టుకోవాలి. సన్నటి జాలీతో వడబోసి, ఐస్‌క్యూబ్‌లు వేసి చల్లగా సర్వ్‌ చేయాలి.

Updated Date - 2021-04-03T19:21:25+05:30 IST