జలక్‌ళ

ABN , First Publish Date - 2021-08-12T05:25:50+05:30 IST

మెట్ట ప్రాంతాల్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ జలకళ పథకాన్ని ప్రవేశపెట్టింది.

జలక్‌ళ

తీవ్ర నిరాశలో రైతులు

నత్తనడకన వైఎస్సార్‌ జలకళ

పది నెలల్లో జిల్లాలో వేసిన బోర్లు 447 

7,420 దరఖాస్తులకు 393 విజయవంతం

మెట్టప్రాంతాల్లో రైతులకు తప్పని సాగునీటి వెతలు 


‘జలసిరి’ కాదు.. ఉచితంగా ‘జలకళ’ తెస్తామన్నారు. మెట్ట రైతుల సాగునీటి వెతలు తీర్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతోపాటు అగ్రవర్ణాల పేద రైతుల భూములను సస్యశ్యామలం చేస్తామన్నారు. గత ప్రభుత్వ పథకాన్ని రద్దు చేసి ఉచితంగా బోర్లు వేసి, పంపుసెట్టుతో పాటు విద్యుత్‌ కనెక్షన్‌ కూడా ఇప్పిస్తామన్నారు. ఇంకేం.. పంట భూముల్లో జలకళేనని సంబరపడిన రైతులు పెద్దసంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. పది నెలలు గడిచింది. దరఖాస్తులు ఎటుపోయాయో.. బోర్లు ఏమయ్యాయో కాని  రైతుల సాగునీటి వెతలు మాత్రం అలాగే ఉన్నాయి. ఇప్పటికి రెండు సార్లు జలసిరి పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించారే కాని ఆ స్థాయిలో జిల్లాలో బోర్లు పడిన దాఖలాలు కానరావడంలేదు. ఆశించిన విధంగా పనులు వేగవంతంగా జరగడంలేదు. దీంతో  అసలు ఈ పథకం తమకు అందుతుందా లేదా అని రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. 


 గుంటూరు(తూర్పు), ఆగస్టు 11 : మెట్ట ప్రాంతాల్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ జలకళ పథకాన్ని ప్రవేశపెట్టింది. మెట్ట ప్రాంతాల్లో సాగునీటి వెతలకు శాశ్వత పరి ష్కారం చూపాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి  రూపకల్పన చేసింది. రైతులకు వ్యవసాయ గొట్టపు బావుల తవ్వకంలో నెలకొన్న ఆర్థిక భారం నుంచి ఉపశమనం కల్పించాలని వైఎస్సార్‌ జలకళ ను 10 నెలలు క్రితం ప్రారం భించింది. సొంత భూమి రెండున్నర ఎకరాల నుంచి ఐదు ఎకరాల్లోపు ఉన్న సన్న, చిన్న కారు రైతులు ఈ పఽథకానికి అర్హులుగా ప్రకటించారు. వీరికి సొంత బోరు ఉండకూడదు. బోరు, పంపు సెట్టు, విద్యుత్‌ సదుపా యం ఉచితంగా కల్పిస్తారు. 5-10 ఎకరాల ఉన్న రైతులకు కేవలం బోరు లబ్ధి మాత్రమే కల్పిస్తారు. రెండు ఎకరాల్లోపు భూమి ఉంటే ఇరుగు పొరుగు రైతులతో కలిసి సంయుక్తంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పి స్తారు. దీంతో పొలాల్లో సాగునీటి కోసం బోర్లు వేసుకోలేని వారందరూ ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని పెద్దసంఖ్య లో దరఖాస్తులు చేసుకున్నారు. అయితే జిల్లాలో క్షేత్రస్థా యిలో జలకళ పనులు చూస్తే నత్తేనయం అన్నట్టుగా సాగుతున్నాయి. భూగర్భం నుంచి నీటిని తోడేందుకు 5, 7.5, 10, 12.5 సామర్థ్యపు యంత్రాల ఏర్పాటుకు ఇంకా విధివిదానాలు ఖరారు కాలేదు.  జలకళలో భాగంగా జిల్లా లో ఆరు క్లస్టర్లకు సంబంధించి మొత్తం 7,420 దరఖాస్తులు అందాయి. వీటిలో కేవలం 447 చోట్ల మాత్రమే బోర్లు వేశా రు. వాటిలో 393 చోట్ల మాత్రం విజయవంతమై నీరు పడగా.. 54 చోట్ల విఫలమయ్యాయి. కొన్ని చోట్ల బోర్లు తవ్వినా మోటారు భాగ్యం కలగలేదు. మరి కొన్ని చోట్ల మోటార్లకు విద్యుత్‌ సరఫరా చేయలేదు. దీంతో బోర్లు తవ్విన రైతులు కూడా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.


ప్రహసనంలా .. ప్రక్రియ

జలకళ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ప్రక్రియ పెద్ద ప్రహసనంలా ఉందనే విమర్శలున్నాయి. అన్ని అర్హతలు ఉన్న రైతులు తొలుత గ్రామ సచివాలయంలో దరఖాస్తుల ను అందజేయాలి. లేదంటే జలకళ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని వీఆర్వోలు పరిశీలిం చాలి. ఆ తర్వాత ఏపీడీ తనిఖీ చేయాలి. వాటిని సంబంధిత కాంట్రాక్టరుకు పంపు తారు. ఆ తరువాత కాంట్రాక్టురు భూగర్భ జలశాస్త్రవేత్తల ద్వారా నీటి జాడలపై సర్వే చేయిస్తారు. అంతా సక్రమంగా ఉంటే నిపుణులు ఆయా దరఖాస్తులను పరిపాలన అనుమతి కోసం డ్వామా కార్యాలయానికి పం పుతారు. అక్కడ అనుమతులు పొం దాక బోరు తవ్వడం ప్రారంభిస్తారు. ఇంత ప్రక్రియ ఉండటంతో ఒక్కో బోరు తవ్వేందుకు చాలా సమయం పడుతుంది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో 10శాతం కూడా బోర్లు తవ్వకం పూర్తి కాలేదంటే జలకళ ప్రక్రియ ఎంత క్లిష్టంగా ఉం దో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో కొన్ని చోట్ల డ్రిల్లింగ్‌ పనుల్లో 20 నుంచి 40 శాతం విఫలమైనట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో బొల్లాపల్లి, వెల్దుర్తి, దుర్గి, మాచర్ల మండల్లాలో 19 గ్రామాల్లో భూగర్భంలో నీటి జాడలు తక్కువుగా ఉన్నట్టుగా గుర్తించారు. ఇక్కడ 35 శాతం వరకు ప్రయత్నించాలని, ఆ తరువాత విఫలమైనా రిగ్గు యజమానులకు బిల్లులు చెల్లించేలా నిబంధనలు సవరణ చేయాలని అయా గ్రామాల రైతులు కోరుతు న్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


నీటి జాడలు లేవని

మిగిలిన క్లస్టర్లులో ఎలా ఉన్న 1822 ధరఖాస్తులు వచ్చిన మాచర్ల పరిధిలో ఒక్క బోరు కూడా తవ్వలేదు. అక్కడ కొన్ని గ్రామాల్లో భూగర్భంలో నీటి శాతం తక్కువుగా ఉందని కారణం చూపి మొత్తం క్లస్టర్‌ పరిధిలో బోరు తవ్వకాలు నిలిపివేశారు. వివిధ మండలాల్లో మొత్తం 19 గ్రామాల్లో నీటి జాడలు లేవని అక్కడ జలకళ అసాధ్యమని అధికారులు ధ్రువీకరించారు

 బొల్లాపల్లి మండలంలో రావులపాలెం, గుళ్లపల్లి, గండిగనుమాల, గుమ్మనంపాడు, రేమిడిచర్ల, వెల్దుర్తి మండలంలో గొట్టిపాళ్ల,  శిరిగిరిపాడు, పాట్లవీడు, ఉప్పలపాడు,కందలకుంట, రాచమల్లిపాడు, గుండ్లపాడు, మందడి, దుర్గి మండలంలో పోలేపల్లి, కోలగుట్ల, ఆత్మకూరు, మాచర్ల మండలంలో మాచర్ల, రాయవరం, ఆమని జమ్మలమడక.



Updated Date - 2021-08-12T05:25:50+05:30 IST