Jal Shakti Minister : గంగా నది ప్రక్షాళనకు రూ.30 వేల కోట్లు మంజూరు

ABN , First Publish Date - 2022-08-17T02:19:37+05:30 IST

అత్యంత పవిత్రమైన గంగా నదిని, దాని ఉప నదులను ప్రక్షాళన చేయడం

Jal Shakti Minister : గంగా నది ప్రక్షాళనకు రూ.30 వేల కోట్లు మంజూరు

న్యూఢిల్లీ : అత్యంత పవిత్రమైన గంగా నదిని, దాని ఉప నదులను ప్రక్షాళన చేయడం కోసం రూ.30,000 కోట్లకుపైగా మంజూరు చేసినట్లు జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ (Gajendra Singh Shekhawat) తెలిపారు. నీటి వనరులు, విద్యుత్తు ఆర్థికాభివృద్ధికి చాలా ముఖ్యమని చెప్పారు. యమున పర్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.


సహజ వనరుల అవసరాలు, ఆర్థికాభివృద్ధి గ్రాఫ్ ఒకేవిధంగా ఉంటాయని చెప్పారు. భారత దేశ జనాభా, భౌగోళిక విస్తృతి దృష్ట్యా, నీటిని, ఇతర సహజ వనరులను పొదుపుగా వాడుకోవాలన్నారు. గంగా నదిని, దాని ఉప నదులను ప్రక్షాళన చేయడం కోసం అనేక మౌలిక సదుపాయాలను కల్పించినట్లు తెలిపారు. ‘నమామి గంగే’ (Namami Gange) కార్యక్రమానికి ప్రజల నుంచి, వివిధ సంస్థల నుంచి మద్దతు లభిస్తోందన్నారు. ఇది సామూహిక ఉద్యమంగా మారిందని చెప్పారు. గంగా నది పరీవాహక ప్రాంతంలోని 100కుపైగా జిల్లాల్లో ఈ నదికి సంబంధించిన సమస్యలపై చర్చలు జరిగాయని, పరిహార చర్యలను అమలు చేస్తున్నామని చెప్పారు. 


Updated Date - 2022-08-17T02:19:37+05:30 IST