కరోనా నుంచి రక్షణ కోసం మొత్తం విమానాన్ని బుక్ చేశాడు...

ABN , First Publish Date - 2021-01-08T15:55:26+05:30 IST

జకార్తా దేశానికి చెందిన ఓ వ్యక్తి తనతోపాటు తన జీవిత భాగస్వామిని కరోనా వైరస్ బారినుంచి రక్షించుకోవడానికి ఏకంగా మొత్తం విమానాన్నే బుక్ చేసిన ఘటన సంచలనం....

కరోనా నుంచి రక్షణ కోసం మొత్తం విమానాన్ని బుక్ చేశాడు...

బాలి : మీరు విమానంలో ప్రయాణించాలంటే కరోనా నుంచి రక్షణకు పీపీఈ సూట్ ధరిస్తారు లేదా ముఖానికి మాస్కు, కవచం ధరించవచ్చు. కాని జకార్తా దేశానికి చెందిన ఓ వ్యక్తి తనతోపాటు తన జీవిత భాగస్వామిని కరోనా వైరస్ బారినుంచి రక్షించుకోవడానికి ఏకంగా మొత్తం విమానాన్నే బుక్ చేసిన ఘటన సంచలనం రేపింది. జకార్తా దేశానికి చెందిన రిచర్డ్ ముల్జాది తన భార్య షాల్విన్ చాంగ్‌లు జనవరి 4వతేదీన బాలికి వెళ్లేందుకు కరోనా భయంతో మొత్తం విమానాన్నే బుక్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని రిచర్డ్ తన చిత్రంతోపాటు ఖాళీ విమానం ఫొటోలను ఇన్‌స్టాగ్రాంలో పంచుకున్నారు. 

 


కొవిడ్-19 నుంచి తనతోపాటు తన భార్యను రక్షించుకోవడానికి జకార్తాకు చెందిన ఓ సామాజికవేత్త బాలికి వెళ్లేందుకు మొత్తం విమానాన్ని బుక్ చేసిన ఉదంతం తాజాగా వెలుగుచూసింది. తోటి ప్రయాణికులను వైరస్ రాకుండా సురక్షితంగా తాను తన భార్యతో కలిసి బాలికి ప్రయాణిస్తానని రిచర్డ్ చెప్పారు. రిచర్డ్ కథకు బాలిలోని బాతిక్ ఎయిర్ యజమానులు ట్విస్ట్ ఇచ్చారు. తన వాదనలకు విరుద్ధంగా తాము ఇద్దరు ప్రయాణికులను మాత్రమే టికెట్లు బుక్ చేశామని ఎయిర్ లైన్సు తెలిపింది. 

Updated Date - 2021-01-08T15:55:26+05:30 IST