Abn logo
Sep 17 2021 @ 00:47AM

సంస్థాగత ఎన్నికలకు సిద్ధం కండి

మాట్లాడుతున్న జన్ను జఖార్య

  - టీఆర్‌ఎస్‌ పాలకుర్తి ఇన్‌చార్జి జన్ను జఖార్య

దేవరుప్పుల, సెప్టెంబరు 16 : సంస్థాగత ఎన్నికలకు సిద్ధం కావాలని టీఆర్‌ఎస్‌ పాలకుర్తి ఇన్‌చార్జి జన్ను జఖార్య పిలుపునిచ్చారు. గురువారం జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ మండల విస్తృతస్థాయి సమావేశానికి జఖార్యతో పాటు దేవరుప్పుల ఇన్‌చార్జిలు గుడి వంశీధర్‌రెడ్డి, మనోహర్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్ష పదవితోపాటు మండల కమిటీ పదవులు, అనుబంధ కమిటీల పదవులు ఉంటాయన్నారు. పార్టీలో పని చేసిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. ఈ విషయమై రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రగిరిజన కోఆపరేటీవ్‌ మాజీ చైర్మన్‌ గాంధీ నాయక్‌, పార్టీ మండల అధ్యక్షుడు తీగల దయాకర్‌, నాయకులు బస్వ మల్లేశం, పల్లా సుందర్‌రాంరెడ్డి, వీరారెడ్డి దామోదర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, కొల్లూరు సోమయ్య, కారుపోతుల భిక్షపతి, మేకపోతుల ఆంజనేయులు గడ్డం రాజు, చింత రవి, కృష్ణమూర్తి, సిందె రాంనర్సయ్య, కోతి ప్రవీణ్‌, కొత్త జెలేందర్‌రెడ్డి, వృకోధర్‌రెడ్డి, నారెడ్డి సంజీవరెడ్డి, మైదం జోగేశ్వర్‌, జోగు సోమనర్సయ్య, రాంసింగ్‌, నర్సింహులు, మహేష్‌, హన్మంతు పాల్గొన్నారు.