ముంబై 248/5

ABN , First Publish Date - 2022-06-23T08:56:28+05:30 IST

ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ (78) అర్ధ శతకంతో ముంబై

ముంబై 248/5

జైస్వాల్‌ అర్ధ శతకం

మధ్యప్రదేశ్‌తో రంజీ ఫైనల్‌


బెంగళూరు: ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ (78) అర్ధ శతకంతో ముంబైకు శుభారంభం దక్కినా.. మధ్యప్రదేశ్‌ బౌలర్లు క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌లో ప్రత్యర్థి జోరుకు కళ్లెం వేశారు. దీంతో బుధవారం ఆరంభమైన రంజీ ఫైనల్‌ తొలి రోజు ఇరుజట్లూ సమంగా నిలిచాయి. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 248 పరుగులు చేసింది. ఆటముగిసే సమయానికి సర్ఫ్‌రాజ్‌ ఖాన్‌ (40), శామ్స్‌ ములాని (12) క్రీజులో ఉన్నారు. కెప్టెన్‌ పృథ్వీ షా (47), జైస్వాల్‌ తొలి వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యంతో చక్కని ఆరంభాన్నిచ్చారు.


కానీ, షాను అనుభవ్‌ అగర్వాల్‌ (2/56) అవుట్‌ చేసిన తర్వాత.. పరిస్థితి మారిపోయింది. ఫామ్‌లో ఉన్న సువేందు పార్కర్‌ (18)ను సారాంశ్‌ (2/31) అవుట్‌ చేయడంతో ముంబై బ్యాటింగ్‌ ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలో జైస్వాల్‌, హార్దిక్‌ తమోర్‌ (24) వికెట్లను చేజార్చుకుంది. ఇక, ముంబైను 400 పరుగుల మార్క్‌ దాటించే భారమంతా సర్ఫ్‌రాజ్‌పైనే! 

Updated Date - 2022-06-23T08:56:28+05:30 IST