దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ

ABN , First Publish Date - 2021-05-05T04:09:52+05:30 IST

భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇవాళ దక్షిణాఫ్రికా విదేశీ వ్యవహారాల మంత్రి నలేది మందిసా పండోర్‌తో సమావేశం అయ్యారు...

దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ

లండన్: భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇవాళ దక్షిణాఫ్రికా విదేశీ వ్యవహారాల మంత్రి నలేది మందిసా పండోర్‌తో సమావేశం అయ్యారు. ఆర్థిక వ్యవస్థకు పునర్వైభవం కల్పించడంతో పాటు కామన్వెల్త్ సమస్యలపై ఈ భేటీలో చర్చించారు. లండన్‌లో జరిగిన జీ7 విదేశాంగ, అభివృద్ధి మంత్రుల సమావేశం సందర్భంగా వీరిరువురూ సమావేశం అయ్యారు. సమావేశం అనంతరం జైశంకర్ ట్విటర్‌లో స్పందిస్తూ... ‘‘దక్షిణాఫ్రికా విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ నలేది పండోర్‌తో సమావేశం సమావేశం కావడం హర్షణీయం. కొవిడ్ సవాల్‌ను ఎదుర్కునేందుకు కలిసికట్టుగా పనిచేయడంపై ఉపయోగకరమైన చర్చ జరిగింది. ఆర్థిక వ్యవస్థ పునర్వైభవం, కామన్వెల్త్ సమస్యలపై కూడా మాట్లాడాం..’’ అని పేర్కొన్నారు. రెండేళ్ల తర్వాత తొలిసారి లండన్ వేదికగా జీ-7 విదేశాంగ, అభివృద్ధి మంత్రులు ముఖాముఖి సమావేశం కావడం ఇదే తొలిసారి. జీ-7లో భాగస్వాములు కాకపోయినప్పటికీ.. దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా, బ్రునేలి, ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య చైర్మన్‌‌లకు అతిథులుగా అహ్వానాలు అందాయి. 

Updated Date - 2021-05-05T04:09:52+05:30 IST