ఖ‌తార్ విదేశాంగ మంత్రితో జైశంక‌ర్ భేటీ

ABN , First Publish Date - 2021-06-16T15:25:14+05:30 IST

భార‌త విదేశాంగ మంత్రి ఎస్ జైశంక‌ర్ త‌న మూడు రోజుల కెన్యా ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని తిరిగి ఇండియాకు వ‌స్తున్న క్రమంలో మంగ‌ళ‌వారం ఖ‌తార్ రాజ‌ధాని దోహాలో ఆగారు.

ఖ‌తార్ విదేశాంగ మంత్రితో జైశంక‌ర్ భేటీ

దోహా: భార‌త విదేశాంగ మంత్రి ఎస్ జైశంక‌ర్ త‌న మూడు రోజుల కెన్యా ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని తిరిగి ఇండియాకు వ‌స్తున్న క్రమంలో మంగ‌ళ‌వారం ఖ‌తార్ రాజ‌ధాని దోహాలో ఆగారు. ఈ సంద‌ర్భంగా ఆ దేశ విదేశాంగ మంత్రి, ఉప ప్ర‌ధాని మ‌హ‌మ్మ‌ద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అల్ థానితో భేటీ అయ్యారు. ఈ స‌మావేశాన్ని ప్ర‌స్తావిస్తూ జైశంక‌ర్ ట్వీట్ చేశారు. "ఇవాళ దోహాలో ఖ‌తార్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని మ‌హ‌మ్మ‌ద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్‌ను క‌ల‌వ‌డం ఆనందంగా ఉంది. క‌రోనా సెకండ్ వేవ్‌తో పోరాడుతున్న భార‌త్‌కు ఖ‌తార్ చేదోడుగా నిల‌వ‌డం అభినంద‌నీయం. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ సమస్యలపై చ‌ర్చ‌లు జ‌రిగాయి" అని మంత్రి త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, మంత్రి జైశంక‌ర్ వారం రోజుల వ్య‌వ‌ధిలోనే రెండుసార్లు దోహాను సంద‌ర్శించారు. ఈ నెల 9న కువైట్ వెళ్తూ దోహాలో ఆగిన మంత్రి.. ఖ‌తార్ నేష‌న‌ల్ సెక్యూరిటీ అడ్వైజ‌ర్ మ‌హ్మ‌ద్ బిన్ అహ్మ‌ద్ అల్ మెస్నెద్‌తో స‌మావేశ‌మ‌య్యారు. క‌రోనాపై పోరులో భాగంగా భార‌త్‌కు గ‌ల్ఫ్ దేశాలు అందిస్తున్న సాయం ప‌ట్ల అభినంద‌న‌లు తెలిపారు.      


Updated Date - 2021-06-16T15:25:14+05:30 IST